ఆర్డీఓ మహేష్
విశాలాంధ్ర ధర్మవరం;: క్షేత్రస్థాయిలో బాల్యవివాహాల నివారణకు కృషి చేయాలని ఆర్డీవో మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం డివిజన్ స్థాయి బాల్య వివాహల నిరోధక అధికారులతో జరిగిన కార్యశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ అనుబంధముగా పని చేస్తున్నా సిడిపిఓ లక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఆర్డీఓ మహేష్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ డివిజన్ లో ఇప్పటి వరకు 67 బాల్య వివాహాలు రిపోర్ట్ కాగా అందులో పది మంది పైన పోలీస్ కేసులు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు. మిగిలిన వాటి గురించి ఎందుకు కేసులు నమోదు జరగలేదు? అని వాటిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
క్షేత్రస్థాయిలో పని చేసే వారు బాల్య వివాహల నివారణకు కృషి చేయాలి అన్నారు. ఇక నుండి ప్రతి నెల నాలుగో శనివారం ప్రతి పంచాయితీలో బాల్య వివాహల నిర్ములన గురించి మాట్లాడాలని అలాగే డివిజన్ స్థాయిలో రివ్యూ చేస్తానని వారు తెలియజేశారు. అదే విదంగా పాఠశాలలో చదువుతున్న బాలబాలికలకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని వారు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో బాల్య వివాహల నివారణకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పని చేసే వీఆర్వోలు,పంచాయతీ సెక్రెటరీలు,మహిళా పోలీసులు కలిసికట్టుగా పని చేస్తే మెరుగైన ఫలితాలు చూడవచ్చని తెలిపారు. బాల్య వివాహ రహిత డివిజన్ గా చూడటానికి అందరు కలిసి పని చేస్తే సాధ్యం అవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో
మిషన్ వాత్సల్య జిల్లా సమన్వయకర్త మహేష్,సిడిపిఓలు లక్ష్మి, కవిత,చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ జిల్లా సమన్వయకర్త కొండప్ప,ప్రొటెక్షన్ ఆఫీసర్లు మురళి, నాగలక్ష్మి, సోసియల్ వర్కర్స్ ఆనంద్, వనజాక్షి,తేజస్విని, కౌన్సిలర్ శివలత, మరియు సిబ్బంది, ఎంపిడిఓలు, యంఈఓలు, పంచాయతీ సెక్రటరీలు,వీఆర్వోలు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో బాల్య వివాహల నివారణకు కృషి చేయాలి…
- Advertisement -
RELATED ARTICLES


