విశాలాంధ్ర – కడియం : చిరు సేవాసమితి స్థాపించి, 25 సంవత్సరాలుగా వేలాదిమందికి రక్తదానం చేస్తూ, నిస్వార్ధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గెడ్డం శివ రత్న గణపతి మరియు చిరు సేవా సమితి సభ్యులు, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని మెగా బ్రదర్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు. కడియం మండలం, బుర్రిలంక గ్రామానికి చెందిన గెడ్డం శివ ఆధ్వర్యంలో స్థాపించిన “చిరు సేవాసమితి” రజతోత్సవ వేడుకలు ఇటీవలే ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరు కావలసిన మెగాబ్రదర్ నాగబాబు అనివార్య కారణాల వల్ల హాజరు కాలేదు. అయితే శివకు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా, ప్రత్యేక వీడియో సందేశం కూడా పంపించారు. నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికై, మొదటిసారిగా శాసనమండలి సమావేశాలకు హాజరైన సందర్భంగా శివ “చిరు సేవాసమితి” సభ్యులతో కలిసి, హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని నాగబాబు నివాసంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగబాబు చిరు సేవా సమితి సభ్యులకు ఆతిథ్యం ఇచ్చి, అభినందనలు తెలిపారు. భవిష్యత్లో తప్పకుండా వేడుకలకు హాజరవుతానని హామీ ఇచ్చారు. అలాగే, జనసేన పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన వ్యూహంపై చర్చించారు. ఈకార్యక్రమంలో చిరు సేవాసమితి సభ్యులు తాళం నరేష్, తాడాల ధర్మరాజు, కంచుమర్తి సిద్దు, పి నరసింహ తదితరులు పాల్గొన్నారు.
చిరు సేవా సమితి” సభ్యులకు మెగాబ్రదర్ నాగబాబు అభినందనలు
- Advertisement -
RELATED ARTICLES


