Homeఆంధ్రప్రదేశ్పదో తరగతి విద్యార్థులకు మంత్రి లోకేశ్ , జగన్ శుభాకాంక్షలు..

పదో తరగతి విద్యార్థులకు మంత్రి లోకేశ్ , జగన్ శుభాకాంక్షలు..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా నేడు పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని, ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాయాలని లోకేశ్ సూచించారు. ‘ఒత్తిడికి గురికావద్దు. ప్రశాంతంగా ఉండండి. 100 శాతం మీ ప్రతిభను ప్రదర్శించే సమయం. ప్రణాళికాబద్ధంగా పరీక్షలు రాయండి. విజయం మీదే. ఆల్ ది బెస్ట్ అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. విద్యార్థులు తమ పూర్తి ప్రతిభను కనబరిచి మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కాగా, మార్చి 16న ప్రారంభమైన ఈ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

పదో తరగతి విద్యార్థులకు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పిన జగన్

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు వైసీపీ అధినేత జగన్ ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా జగన్ స్పందిస్తూ స్పందిస్తూ, విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్తు అని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ఏకాగ్రతతో ఉండాలని, తమపై తాము నమ్మకం ఉంచి కష్టపడితే కచ్చితంగా విజయం లభిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రతి విద్యార్థి తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాలని ఆయన సూచించారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల కోసం విద్యాశాఖ పటిష్ఠమైన ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచడంతో పాటు, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు