విశాలాంధ్ర, పార్వతీపురం: జిల్లాలోని సీతానగరం మండలంలోని గాదెలవలస గ్రామములో టైప్ _4 బాలికల వసతి గృహాన్ని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర బుధవారంనాడు ప్రారంభించారు. ఎమ్మెల్యే విజయ్ చంద్రకు మహిళలు, విద్యార్థినీ విద్యార్థులు మేళతాళాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనస్వాగతం పలికారు. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించబడిన బాలికల వసతిగృహం ఎట్టకేలకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర మీద చేతుల మీదుగా ప్రారంభించడం పట్ల ఈప్రాంతప్రజలు, తల్లిదండ్రులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. బాలికలు చదువుకోవడానికి వసతి గృహాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు. ఈవసతిగృహం ప్రారంభం వలన ఈప్రాంతంలో బాలికల్లో విద్య మరింత అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. బాలికలు బాగా చదువుకొని అన్నిరంగాలలో రాణించాలన్నారు. ఈకార్యక్రమంలోసర్వ శిక్ష అభియాన్ ఏపీసి తేజేశ్వరరావు, ఎంపిడిఓ ఎంఎల్ఎన్ ప్రసాద్, తహాసిల్దార్ ప్రసన్నకుమార్, జిసిడిఓ భారతి,
ఎంఈఓ సూరిదేముడు, డిప్యూటీ ఎంపీడీఓ కుమార్ వర్మ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం మూడడ్ల శంకరరావు, సర్పంచ్ బి తిరుపతిరావు, టీడీపీ నాయకులు పెంట సత్యంనాయుడు, రౌతువేణుగోపాలనాయుడు, దామినేని భాను ప్రసాద్,బోగి శంకరరావు, బొన్నాడ సత్యనారాయణ, యాండ్రాపు ప్రసాదరావు, తిరుపతిరావు,రవీంద్ర, ధనంజయ, రామినాయుడు, బుడితి శ్రీనివాసరావు,గరికయ్య, కె అరవింద్ కుమార్, రెడ్డి సింహాచలం, పైల నాగభూషణం,
తేలు చంద్రశేఖర్, బలగ శ్రీనివాసరావు, కళ్యాణ బలరాం,జగన్నాధం, జనసేన నాయకులు శంకర్రావు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, సచివాలయ సిబ్బంది, చుట్టు పక్కల ప్రజలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా మైదానంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.


