సిపిఐ శ్రీ సత్య సాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మూసుగు మధు
రెండవ మహాసభలకు సర్వం సిద్ధం
విశాలాంధ్ర ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) ; సిపిఐ జిల్లా రెండవ మహాసభ నియోజకవర్గంలోని ధర్మవరంలో ఈనెల 31 వ తేదీ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఎన్టీఆర్ సర్కిల్ నందు నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎర్రం శెట్టి రమణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ కే. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పి. రామచంద్రయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ డి. జగదీష్, వక్తలుగా సిపిఐ జిల్లా కార్యదర్శి అనంతపురం కామ్రేడ్ సి. జాఫర్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ వి. జాన్సన్ బాబు, రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కామ్రేడ్ ఏ. కాటమయ్య, ఏపీ .చేనేత, చేతివృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ జింకా చలపతి పాల్గొంటున్నారని తెలిపారు. సిపిఐ పార్టీ పేదల పాలిట కల్పతరువు అని తెలిపారు. పేద ప్రజల సమస్యలను పరిష్కరించుటలో ఎన్నో సంవత్సరాలుగా ప్రజా పోరాటాలు సల్ఫీ, విజయ డంకా రాష్ట్రవ్యాప్తంగా మోగిచ్చిందన్నారు. పేద ప్రజలకు కావలసిన సౌకర్యాలను, అధికారుల ద్వారా ప్రభుత్వాలకు తెలియజేసి పరిష్కరించడంలో సిపిఐ పార్టీ విశేష కృషి చేస్తుందని తెలిపారు. భవిష్యత్ తరాలకు సిపిఐ పార్టీ ఒక కేంద్రమవుతుందని తెలిపారు. అన్ని వర్గాల కులాలకు, రాజకీయ పార్టీల అతీతంగా సమస్యలను పోరాటంలో ముందుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బెదిరింపులకు బెదరకుండా ధైర్యంగా సమస్యలను పరిష్కరించుకుంటూ పోతూ ప్రజల వద్ద ఒక మంచి గుర్తింపు పొందిన పార్టీ సిపిఐ పార్టీ అన్నారు. విద్య, వైద్య, కూడు, గుడ్డ తదితర అవసరాలు గల పేద ప్రజలకు సమకూర్చటంలో సిపిఐ పార్టీ ఇప్పటికీ కూడా ఎనలేని కృషి చేస్తుందని వారు స్పష్టం చేశారు. కావున ఈ జిల్లా రెండవ మహాసభలకు సిపిఐ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు వేల సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.


