: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
విశాలాంధ్ర బ్యూరో- కర్నూలు : అమెరిక అధ్యక్షుడు ట్రంప్ ఒక్క ఫోన్ కాల్ తో మోడీ పాకిస్తాన్ తో యుద్ధం విరమించారని, రాష్ట్ర ముఖ్యమంత్రి సింగపూర్ లో. ఉంటే డిప్యూటీ సీఎం సినిమాల్లో బిజీ అయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు.అధికారము ఉన్నా లేకపోయిన దేశ ములో కోట్లాది మంది పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి అండగా నిలిచే ది సీపీఐ నే అన్నారు. బుధవారం నంద్యాల జిల్లా సీపీఐ జిల్లా రెండవ మహాసభ సందర్భంగా డోన్ పట్టణంలోని పాతబస్టాండ్ జరిగిన బహిరంగ సభ సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు అధ్యక్షత న జరిగింది.
ఈ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో 11 సంవత్సరాలు అధికారము లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయ్య లేదన్నారు. రైతులు ఆప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్య లకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దే శములో పేదరికము తగ్గింది అని చెపుతున్న బీజేపీ ప్రభుత్వం 50 కోట్ల మంది ప్రజలకు నే టికీ ఉచిత బియ్యం యందుకు ఇస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు అధికార ము లేనప్పుడు ఒక విధంగా అధికారం వచ్చిన తర్వాత మరోవిధము ఉంటారని విమర్శించారు. ఇచ్చిన హామీ మే రకు పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు నివాస స్థలం ఇవ్వాలన్నారు. లేని పక్షంలో పేదలని సమీకరించి ప్రభుత్వం పై ఆందోళన చేస్తామని హెచ్చరించా రు. అనంతరం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ పెత్తం దారి విధానం కు వ్యతిరేకంగా పోరాటం చేసిన గడ్డ డోన్ అన్నారు. ఎర్రజెండా కు అధికారము రావాలంటే పార్టీ ని కింది స్థాయి నుండి బలోపేతం చేయాలన్నారు. మోడీ ప్రభుత్వం వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతూ సామాన్యులను ఇబ్బందు లకు గురి చేస్తోందన్నారు.పేదల తల రాత మార్చే ప్రభుత్వం కోసం ప్రతిఒక్కరు మీ ఓటు అనే ఆయుధం తో ఎర్రజెండా పార్టీకి ఓటు వెయ్యాలన్నారు. ఈ బహిరంగ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి రామచంద్రయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, లెనిన్ బాబు, ఆవుల శేఖర్, సీపీఐ సీనియర్ నాయకులు భీమలింగప్ప, సీపీఐ నంద్యాల ,కర్నూలు జిల్లా నాయకులు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.అంతకు ముందు క్రొత్త బస్టాండ్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు.



