- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణముకుండా వెళ్లే ఇసుక టిప్పర్లు ఇసుక పైన తప్పనిసరిగా పట్టా కప్పాలని ఆర్టీవో రాణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్డీవో మహేష్ ఆదేశాల మేరకు ఇసుకతోనే టిప్పర్లు ఇకనుంచి తప్పనిసరిగా పట్టకప్పుకొని ఇసుకను తరలించాలని తెలిపారు. రోడ్డు మీద వెళ్లే ఇసుక టిప్పర్లు వెనకాల వచ్చే వాహనదారులకు ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయని నిర్లక్ష్యం చేస్తే వాహనాలకు చలానా విధించడంతోపాటు వాహనమును సీజ్ చేస్తామని తెలిపారు.


