Wednesday, July 2, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమొహరం పండుగను శాంతియుతంగా నిర్వహించు కోవాలి

మొహరం పండుగను శాంతియుతంగా నిర్వహించు కోవాలి

ఆర్డీవో మహేష్
విశాలాంధ్ర ధర్మవరం;; మొహరం పండుగలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో ఆర్ డి ఓ అధ్యక్షతన పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ, వైద్యశాఖ, వాటర్ సప్లై శాఖ, విద్యుత్ శాఖ, ఫైర్ ఆఫీసర్, ఎంపీడీవోలు, తాసిల్దార్లతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ మొహరం పండుగ సందర్భంగా తగిన భద్రత, చర్యలు, పారిశుధ్య ఏర్పాట్లు, ఆరోగ్య సదుపాయాలు, తాగునీటి సరఫరా, రాత్రివేళ విద్యుత్ వెలుగు, అత్యవసర సేవలు వంటి ఏర్పాట్లపై అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని వారు తెలిపారు. ప్రతి శాఖ అధికారులు తన కార్య చరణ పథకాన్ని సమీక్షించి, సమయానికి సేవలు అందించాలన్నారు. ఊరేగింపు మార్గాలలో బలహీనమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందన్నారు. ప్రతి శాఖ మధ్య సమన్వయం మెరుగుపడాలని, మొహరం పండుగ ప్రశాంతంగా భద్రతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు తగిన ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించడం జరిగిందన్నారు.

పట్టణంలో మరో మూడు పోలింగ్ బూత్ ఏర్పాట్ల పరిశీలన;; ప్రతినెల ఆర్డీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశాన్ని ఆర్డిఓ మహేష్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికలు, ఓటర్లు పట్ల పలు ఫిర్యాదులు రావడం, సలహాలు స్వీకరించడం జరిగింది. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణంలో ఓటు వేయడానికి పోలింగ్ బూత్ల సమస్యను వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు తేవడంతో, పట్టణంలోని గిర్రాజ కాలనీ రాజేంద్రనగర్ సుందరయ్య నగర్ లలో పోలింగ్ బూత్ ఏర్పాట్ల కొరకు భవనాలను పరిశీలించడం జరిగిందన్నారు. తదుపరి మరోసారి వివిధ రాజకీయ పార్టీ ప్రతిదీరులతో సమావేశమై ఒక నిర్ణయం తీసుకొని నివేదికను జిల్లా కలెక్టర్కు పంపడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో తో పాటు సీనియర్ ఎలక్షన్ అసిస్టెంట్ రాఘవరెడ్డి, రెవిన్యూ సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు