Homeజిల్లాలువిజయనగరంమున్సిపల్ కమిషనర్ కు ఆర్పీలు వినతి పత్రం

మున్సిపల్ కమిషనర్ కు ఆర్పీలు వినతి పత్రం

- Advertisement -

విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : మున్సిపల్ పట్టణాల్లో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆర్పి లకు కనీస వేతనాలు అమలు చేయకుండా ఉద్యోగ భద్రత కల్పించకుండా ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేకలుగా పని చేయించుకుంటుందని , మరోపక్క దేశవ్యాప్తంగా కనీస వేతనం 26,000 అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ అమలు చేయకపోవడం , కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందని ఇవి తక్షణమే విరమించుకోవాలని ఆర్పీలు సమస్యల పరిష్కారానికి,దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో జులై 9వ రాజాం మున్సిపల్ పట్టణంలో పనిచేస్తున్న ఆర్పి లందరూ సమ్మెలో పాల్గొంటామని తెలియజేస్తూ కమిషనర్ జె.రామప్పలనాయుడు కి వినతి పత్రం అందజేశారు. వారి డిమాండ్లు ఇలా తెలియపరిచారు. ఆర్పీలకు కనీస వేతనాలు అమలు చేస్తూ,ఉద్యోగ భద్రత కల్పించాలి, ఆర్పిల గౌరవ వేతనం వ్యక్తిగత ఖాథాలకు జమ చేయాలి,పీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలి,అర్హత కలిగిన ఆర్పి లకు సిఓ గా పదో పదోన్నతులు కల్పించాలి.మహిళా వికాస్ యాప్ రద్దు చేయాలి,లాగిన్ లేని ఆర్పిలకు వెంటనే లాగిన్ ఇప్పించాలి,రాజకీయ వేధింపులు తొలగింపులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు, ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, స్వాతి, సునీత, నాగరత్నం, వరలక్ష్మి తదితర ఆర్పీలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు