Thursday, January 15, 2026
Homeజిల్లాలునెల్లూరుజీవాలకు నట్టల నివారణ మందు తాగించాలి

జీవాలకు నట్టల నివారణ మందు తాగించాలి

- Advertisement -

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : గొర్రెలు మేకల పెంపకం దారులు వారి జీవాలకు తప్పనిసరిగా నట్టల నివారణ ముందు తాగించాలని ఏరియా పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ ఇ. చెన్నకేశవులు అన్నారు. బుధవారం
వలేటివారిపాలెం మండలం సమీరపాలెం గ్రామములో ఉచిత నట్టల నివారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వలేటివారిపాలెం ఏరియా పశు వైద్యాశాల సహయ సంచాలకులు డాక్టర్ ఇ. చెన్నకేశవులు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా సంవత్సరములో రెండు సార్లు నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తున్నారని అన్నారు. సన్న జీవాల రైతులు సద్వినియోగం చేసుకోవాలని, సంవత్సరములో గొర్రెలు, మేకలకు నాలుగు సార్లు డివర్మింగ్ మందులు తాపించడం వలన గొర్రెలు ఆరోగ్యం గా ఉండి త్వరగా చూడు కట్టడం ఆరోగ్యం గా ఉండే పిల్లలు పుడుతాయని తెలియజేశారు. ప్రస్తుతం మండలంలో అన్నీ గ్రామాలలో నోటి జబ్బు (నీలి నాలుక ) వ్యాధికి ముందస్తుగా టీకాలు వేయించుకోవాలని సన్న జీవాల రైతులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం లో సమీరపాలెం గ్రామ సర్పంచ్ నవులూరి. రాజా రమేష్ మరియు పోకూరు పశు వైద్యులు డాక్టర్ యస్. సుధాకర్ సమీరపాలెం రైతు సేవా కేంద్రం పశు వైద్య సహాయకులు డి. చౌడయ్య మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు