Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయిన కిడ్నీ, పేగు, ప్లీహం

ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయిన కిడ్నీ, పేగు, ప్లీహం

- Advertisement -

డ‌యాఫ్ర‌మాటిక్ హెర్నియ విజ‌య‌వంతంగా శ‌స్త్రచికిత్స చేసి న‌యం చేసిన కిమ్స్ స‌వీరా వైద్యులు
విశాలాంధ్ర అనంతపురం : ప‌దివేల మందిలో ఐదుగురికి మాత్ర‌మే వ‌చ్చే అత్యంత అరుదైన డ‌యాఫ్ర‌మాటిక్ హెర్నియా అనే స‌మ‌స్య అనంత‌పురంలో ఒక యువ‌కుడికి వ‌చ్చింది. అత‌డు తీవ్ర‌మైన క‌డుపునొప్పి, ఎద భాగంలో నొప్పి, ఊపిరి అంద‌క‌పోవ‌డం, మూడు రోజులుగా వాంతుల లాంటి స‌మ‌స్య‌తో అనంత‌పురంలోని కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రికి వ‌చ్చాడు. అత‌డికి త‌గిన వైద్య ప‌రీక్ష‌లు చేసి, స‌మ‌స్య ఏంటో తెలుసుకుని, చికిత్స చేసిన ఆస్ప‌త్రికి చెందిన క‌న్స‌ల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్ట్ డాక్ట‌ర్ ఎన్. మ‌హ్మ‌ద్ షాహిద్ ఇందుకు సంబంధించిన వివ‌రాలు మాట్లాడుతూ….
“ఆ యువ‌కుడికి సీఈసీటీ ప‌రీక్ష చేస్తే అస‌లు విష‌యం తెలిసింది. అత‌డు ఎడ‌మ‌వైపు డ‌యాఫ్రమాటిక్ హెర్నియాతో బాధ‌ప‌డుతున్నాడు. అత‌డి పొట్ట‌, ప్లీహం, ఎడ‌మ‌వైపు కిడ్నీ, పేగులు అవ‌న్నీ కూడా ఎద భాగంలోకి వెళ్లి పోయాయి అన్నారు సాధార‌ణంగా గుండె, ఊపిరితిత్తులు ఉండే ఎద భాగాన్ని పొట్ట నుంచి వేరు చేయ‌డానికి డ‌యాఫ్రం అనే ఒక పొర ఉందన్నారు. కానీ, ఈ రోగిలో పుట్టుక‌తోనే అది స‌రిగా ఏర్ప‌డ‌క‌పోవ‌డంతో ఇవ‌న్నీ ఎడ‌మ‌వైపు ఊపిరితిత్తి వైపు వెళ్లిపోయాయి అని తెలిపారు. ఫ‌లితంగా ఊపిరితిత్తి కుచించుకుపోయి, అత‌డికి స‌రిగా ఊపిరి అంద‌ని ప‌రిస్థితి ఏర్పడిందన్నారు. దాంతోపాటు పొట్ట భాగంలో కొంత గ్యాంగ్రిన్ ఏర్ప‌డే ల‌క్ష‌ణాలు కూడా క‌నిపించాయి అని పేర్కొన్నారు . దాంతో అత‌డికి అత్య‌వ‌స‌రంగా శ‌స్త్రచికిత్స చేయాల్సి వచ్చిందన్నారు. అందులోభాగంగా తెరిచిచూస్తే పొట్ట‌, ప్లీహం, ఎడ‌మ‌వైపు మూత్ర‌పిండం, కొంత పేగుభాగం అన్నీ ఎడ‌మ‌వైపు ఎద‌లోకి వెళ్లిపోయాయి. పొట్ట‌భాగం మెలితిరిగిపోయింది అన్నారు. దాన్ని ముందుగా స‌రిచేసి, త‌ర్వాత ఎడ‌మ కిడ్నీని, లోప‌లకు వెళ్లిన పేగుల‌ను అన్నింటినీ మ‌ళ్లీ య‌థాస్థానంలో ఉంచడం జరిగిందన్నారు. ప్లీహం మాత్రం పూర్తిగా మెలితిరిగిపోవ‌డంతో దాన్ని తొల‌గించాల్సి వచ్చిందన్నారు. డ‌యాఫ్రంను కూడా రెండు పొర‌లుగా శ‌స్త్రచికిత్స చేసామన్నారు. త‌ర్వాత రోగిని రెండు రోజులు ఐసీయూలో ఉంచి ఐదు రోజుల త‌ర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధార‌ణ ప‌రిస్థితికి చేరుకోవ‌డంతో అప్పుడు డిశ్చార్జి చేయడం జరిగిందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు