Homeజిల్లాలుఅనంతపురంప్రభుత్వ భూముల కబ్జాకు అడ్డుకట్ట వేయబోతే దాడి..!

ప్రభుత్వ భూముల కబ్జాకు అడ్డుకట్ట వేయబోతే దాడి..!

- Advertisement -

కట్టెలు, రాళ్లతో స్థానికులపై విరుచుకుపడ్డారంటూ ఆరోపణలు..

పబ్లిక్ మరుగుదొడ్ల స్థలం, వంక భూములు సైతం ఆక్రమించారంటున్న గ్రామస్తులు..

అధికారుల నిర్లక్ష్యమే కబ్జాదారులకు అండగా మారిందని ఆగ్రహం..

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికుల ఆరోపణల ప్రకారం, రమేష్ అనే వ్యక్తి ప్రభుత్వానికి చెందిన పలు స్థలాలను కబ్జా చేస్తూ వస్తున్నాడని, తాజాగా మహిళల కోసం గతంలో నిర్మించిన పబ్లిక్ మరుగుదొడ్లు ఉన్న స్థలాన్ని కూడా ఆక్రమించేందుకు యత్నించాడని తెలిపారు.ఈ ఆక్రమణను స్థానికులు అడ్డుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రమేష్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి స్థానికులపై కట్టెలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రయత్నించిన వారిపైనే దాడులకు పాల్పడటం స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ ఘటనలో పలువురు గాయపడగా, బాధితులు భయాందోళనలకు గురయ్యారు.అంతేకాకుండా కూతలేరు వంక పరిసర ప్రాంతంలోని ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజల అవసరాల కోసం కేటాయించిన భూములు, పబ్లిక్ మరుగుదొడ్ల స్థలాలు వరుసగా కబ్జాకు గురవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే కబ్జాదారులకు ధైర్యం కల్పిస్తోందని ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ స్థలాల ఆక్రమణను ప్రశ్నించిన వారిపైనే దౌర్జన్యాలకు పాల్పడటం, భయభ్రాంతులకు గురిచేయడం దురదృష్టకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ భూములపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని కోరుతున్నారు.ఁప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చూసి ఊరుకోవాలా..? అడ్డుకుంటే దాడులు చేయడమేనా..?ఁ అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు…

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు