విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : జాతీయ రహదారి రక్తసిక్తంగా మారింది.వేగంగా పోతున్న కారు గొర్రెల మందపై దూసుకు పోవడంతో గొర్రెల కాపరితోపాటు ,20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. కల్లూరు మండలం ఉలిందకొండ క్రాస్‌రోడ్డు సమీపంలో అతివేగంగా పోతున్న కారు టీఎస్ 09 ఎఎఫ్‌ఎన్ 6699 అనునెంబరు గల కారు గొర్రెల మందపై దూసుకు పోవడంతో సుమారు 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాగా మరి కొన్ని గొర్రెలు గాయపడ్డాయి. గొర్రెల కాపరి ఎల్లారాముడు (49) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన గొర్రల ఖరీదు సుమారు 4లక్షల రూపాయలు ఉండవచ్చని గ్రామస్తులు తెలిపారు. ఉలిందకొండ గ్రామానికి చెందిన ఎల్లా రాముడు ప్రతి రోజు తమ గ్రామం నుండి గొర్రెలను తొలుకొని వచ్చి మేపుకుని పోతుండటం ప్రతిరోజు పరిపాటిగా జరుగుతుండేది.అదే మాదిరిగా మంగళవారం కూడా గొర్రెలను తొలుకొని రావడం ఈ దుర్ఘటన జరిగింది. సంఘటన విషయం తెలుసుకున్న ఉలింద కొండ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలం చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ సీనియర్ నాయకులు గౌరువెంకటరెడ్డి సంఘటనా స్థలం చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతోపాటు టీడీపీ నాయకులు తదితరలు పాల్గొన్నారు.
జాతీయ రహదారి రక్తసిక్తంగొర్రెల కాపరితోపాటు 20 గొర్రెలు మృతి
- Advertisement -
RELATED ARTICLES


