సిపిఐ నేత వై ఎన్ భద్రం విమర్శ
విశాలాంధ్ర _అనకాపల్లి: మండల రెవిన్యూ కార్యాలయంలో తహసిల్దార్ మూడు నెలలుగా అందుబాటులో లేరు. ఇన్చార్జి తహసిల్దార్ గా వ్యవహరిస్తున్న డిప్యూటీ తహసిల్దార్ నిత్యం హైకోర్టు పనిమీద ఎక్కువ రోజులు విజయవాడలోనే మకాం వేసినందున అనకాపల్లి మండల కార్యాలయంలో పనులు ఎక్కడకక్కడే నిలిచిపోయాయి. సర్టిఫికెట్లకు వచ్చిన విద్యార్థులు, రెవెన్యూ సమస్యల పైన వచ్చిన బాధితులు ఇక్కడ అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు వెను తిరిగి వెళ్ళవలసి వస్తుందని సిపిఐ నాయకులు వైఎన్ భద్రం తీవ్రంగా విమర్శించారు. వెంటనే ఇంచార్జ్ లు కాకుండా పర్మినెంట్ తహసిల్దార్ని నియమించి మండల కార్యాలయంలోని పెండింగ్ లో ఉన్న అనకాపల్లి మండలం, పట్టణ వాసుల రెవిన్యూ ఇతర పనులను వెంటనే పూర్తి చేయించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ ను కోరారు. లేకుంటే కమ్యూనిస్టు పార్టీ తరఫున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యేలు చొరవ చూపి వెంటనే అనకాపల్లి తహసిల్దారు తో పాటు కార్యాలయంలో ఖాళీగా ఉన్న అధికారులను వెంటనే భర్తీ చేసి, సమస్యలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
3 నెలలుగా తహసిల్దార్ లేని మండల రెవెన్యూ కార్యాలయం
- Advertisement -


