Homeజిల్లాలుఅనంతపురంవైద్యం, విద్యను పేదలకు దూరం చేస్తున్న ఎన్డీఏ సర్కార్...సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున

వైద్యం, విద్యను పేదలకు దూరం చేస్తున్న ఎన్డీఏ సర్కార్…సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున

- Advertisement -

విశాలాంధ్ర – అనంతపురం రూరల్ ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా మోసపూరిత మాటలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున మండిపడ్డారు. బుధవారం జిల్లా కార్యాలయంలో ఎన్.డి.ఎ ప్రభుత్వం అసెంబ్లీలో చేస్తున్న హామీలపై మండిపడ్డారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బడుగు బలహీన వర్గాలు ప్రభుత్వ విద్యా సంస్థల లో వైద్య విద్యను అందని ద్రాక్షలా తయారు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి పిపిపి విధానాన్ని రాష్ట్రంలో తీసుకువచ్చి వైద్య విద్యను పేదలకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైద్య విద్యను సగం ప్రైవేట్ పరం చేసేందుకు జీవో నెంబర్ 107,108 తీసుకువస్తే వ్యతిరేకించారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆ జీవోలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కాని ఎన్డియే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిన వైద్య విద్యకు శాపంగా మారిన జీవోలను రద్దు చేయకపోగా వైద్య విద్యను పేదలకు అందని ద్రాక్ష లాగా పిపిపి విధానం తీసుకువచ్చి వైద్య విద్యను పేదలకు దూరం చేస్తున్నాది నిజం కాదా అని ప్రశ్నించారు. కేంద్రం, రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కారని మాట్లాడుతున్న మీరు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకుండా ఉన్నారనేది నిజం కాదా అని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు సాగునీటి ప్రాజెక్టులు విద్య వైద్యం పూర్తిగా ప్రైవేటు చేతుల్లోకి అప్పజెప్పేందుకు సిద్దంగా వున్నారని రాబోయే కాలంలో విద్య వైద్యం పేద మధ్యతరగతి వారికి చదువుకోవాలన్న వైద్యం చేయించుకోవాలన్నా లక్షల కోట్ల రూపాయలు కావాల్సిన అవసరం అవుతుందని పేర్కొన్నారు.. వైద్య విద్యను ప్రైవేటీకరణ చేస్తే ప్రజా ఆందోళన పెద్ద ఎత్తున పూనుకుంటామని మళ్లికార్జున రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు