Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా ఆర్పిఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

ఘనంగా ఆర్పిఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

- Advertisement -

ఆర్పీఎఫ్. సిఐ. నాగేశ్వరరావు
విశాలాంధ్ర ధర్మవరం;; రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలోని ఆర్పిఎఫ్ కార్యాలయంలో ఆర్పీఎఫ్ సిఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా ఆర్పిఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే ప్రయాణికులతో రైల్వే భద్రత గూర్చి అవగాహన కల్పించారు. అనంతరం సిఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ రైల్వే శాఖకు ఎవరు కూడా దాడులు చేయరాదని, అలా చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. రైల్వేలో దొంగతనాలు జరగకుండా ప్రత్యేక నిఘాను ఉంచడం జరిగిందని, ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెట్టుకోవడం వలన దొంగతనాలు, మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రైల్వే శాఖ చట్టపరంగా ప్రయాణికులకు భద్రతతో పాటు అన్ని చర్యలను కూడా తీసుకోవడం జరుగుతుందని, రైల్వే ప్రయాణం సుఖవంతమైన ప్రయాణం అవుతుందని తెలిపారు. రైల్వే ప్రయాణికులకు ఆపదలో కానీ, ఏదైనా సమస్యలు ఏర్పడినచో రైల్వే శాఖ అధికారులకు తెలపవచ్చునని తెలిపారు. అనంతరం మండల పరిధిలోని గొట్లూరు గ్రామంలో అనాధలకు బ్రెడ్లు, పంపిణీ, ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని 60 మంది రోగులకు పండ్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈనెల 20వ తేదీ నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ తో పాటు ఎస్ఐ. కోటేశ్వరరావు, ఏఎస్ఐ. పుల్లయ్య సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు