Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా వర్క్‌షాప్, ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

ఘనంగా వర్క్‌షాప్, ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

- Advertisement -

ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎంపీడీవో ఆఫీసులో పంచాయతీల సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన పంచాయతీ అభివృద్ధి సూచిక (పిఎఐ 2.0) పై ఒక ముఖ్యమైన అవగాహన వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించామని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో, పంచాయతీల పనితీరును మెరుగుపరచడం, పారదర్శకత, సమగ్ర అభివృద్ధి సూచీలపై విస్తృతంగా చర్చించడం జరిగిందన్నారు.
ఈ వర్క్‌షాప్‌లో పి ఏ ఐ – 1.0 నుండి 2.0 కు జరిగిన మార్పులు, డిజిటల్ డేటా ఆధారంగా పంచాయతీల అంచనా పద్ధతులు, గ్రామస్థాయి అభివృద్ధికి ప్రోత్సాహక పద్ధతుల గురించి వివరించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమానికి డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ జనార్దన్ రావు, పరిపాలనాధికారి, డిప్యూటీ మండల అభివృద్ధి అధికారి, మండల స్థాయి అధికారులు, ఎం.పి.టి.సీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు కార్యక్రమంలో పాల్గొని పంచాయతీ పాలనలో పారదర్శకత , జవాబుదారీతనాన్ని పెంపొందించడంపై అవగాహన నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా
ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహించామన్నారు. ఈ సంవత్సరం థీమ్, ఆయుర్వేద వైద్యం యొక్క ప్రాముఖ్యత, దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాలు పంచాయతీల బలోపేతానికి, ప్రజారోగ్యానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను చాటిచెబుతున్నాయిని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు