Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅపరా చెరువులో ఉచిత వైద్య శిబిరం

అపరా చెరువులో ఉచిత వైద్య శిబిరం

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అప్పరాచెరువు గ్రామంలో ఈనెల 26వ తేదీ శుక్రవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత వైద్య శిబిరము నిర్వహిస్తున్నట్లు మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ బెంగళూరు వైట్ ఫీల్డ్ లోని వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో, సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో అప్రా చెరువు గ్రామంలో పీర్ల చావడి వద్ద ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయబడినట్లు సంస్కృతి సేవా సమితి ప్రతినిధులు సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు లు తెలిపారు. క్యాన్సర్, గుండె, రక్తపోటు, మధుమేహం, కీళ్ళు, ఎముకలు, కిడ్నీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరో సర్జరీ (వెన్నుముక, నరాల సమస్యలు), ఇ.ఎన్.టి. వంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రముఖ నిపుణ వైద్యులు ప్రత్యేక వైద్యసేవలు అందించనున్నారని తెలిపారు. అలాగే ప్లాస్టిక్ సర్జరీ అవసరమున్న వారికి కూడా నిపుణుల సలహాలు అందించబడతాయని పేర్కొన్నారు. శిబిరంలో ఈసీజీ., ఎకో, క్యాన్సర్ స్క్రీనింగ్, బి.పి. మరియు ఆర్.బి.ఎస్. (రక్తంలో చక్కెర స్థాయి) పరీక్షలు పూర్తిగా ఉచితంగా నిర్వహించబడతాయి అని తెలిపారు. అలాగే చికిత్స అవసరమైన వారికి డా. ఎన్.టి.ఆర్. వైద్యసేవ మరియు ఆయుష్మాన్ భారత్ –పీఎంఆర్వై ద్వారా పథకాల ద్వారా పూర్తిగా ఉచిత శస్త్రచికిత్స సౌకర్యం కల్పించబడుతుందని తెలిపారు.
వివరాల కోసం సంప్రదించవలసిన నంబర్లు: 7998256789, 9535197749 సంప్రదించాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు