Homeజాతీయంయూపీఐ పేమెంట్స్‌పై కొత్త ఛార్జీలు..

యూపీఐ పేమెంట్స్‌పై కొత్త ఛార్జీలు..

- Advertisement -

యూపీఐ మర్చంట్ పేమెంట్స్‌పై కొత్తగా ఎండీఆర్‌ విధింపు
రూ.2,000 దాటిన లావాదేవీలపై 0.4 శాతం ఛార్జ్ వర్తింపు
వినియోగదారులపై భారం లేదు, వ్యాపారులే రుసుము చెల్లించాలి
బ్యాంకులు, పేమెంట్ సంస్థలకు ఏటా రూ.20,000 కోట్ల వరకు ఆదాయం
అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు
దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూపీఐ లావాదేవీలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్‌) విధించాలని ప్రతిపాదించింది. ఈ నిర్ణయంతో బ్యాంకులకు, డిజిటల్ పేమెంట్ సంస్థలకు ఏటా రూ.20,000 కోట్ల వరకు భారీ ఆదాయం సమకూరవచ్చని పలు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

ఎన్‌పీసీఐ మంగళవారం జారీ చేసిన ఆదేశాల ప్రకారం, అక్టోబర్ 15 నుంచి రూ.2,000 దాటిన పర్సన్-టు-మర్చంట్ (P2వీ) యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ వసూలు చేస్తారు. అయితే, ఈ భారం వినియోగదారులపై ఏమాత్రం ఉండదు. వ్యాపారులే ఈ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు ఈ రుసుము గరిష్ఠంగా రూ.300గా పరిమితం చేశారు.

ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ అంచనా ప్రకారం, ఈ కొత్త విధానం ద్వారా ఏటా రూ.20,600 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో సగం లావాదేవీలపై పూర్తిస్థాయిలో 0.4% ఎండీఆర్‌ వర్తించవచ్చని ఆ సంస్థ విశ్లేషించింది.

మరో సంస్థ మోర్గాన్ స్టాన్లీ, ఈ నిర్ణయం పేమెంట్ రంగంలోని సంస్థల ఆదాయంపై పెను ప్రభావం చూపుతుందని పేర్కొంది. దీనివల్ల కొన్ని డిజిటల్ పేమెంట్ ప్రొవైడర్ల ఎబిటా (జుదీITణA) 2028-29 ఆర్థిక సంవత్సరానికి 38 నుంచి 48 శాతం వరకు పెరగవచ్చని అంచనా వేసింది.

యూబీఎస్ సంస్థ అంచనా ప్రకారం, ఈ ఆదాయం ఏటా రూ.10,000 నుంచి రూ.15,000 కోట్ల మధ్య ఉండొచ్చని, ఇందులో 60-70 శాతం బ్యాంకులకు, మిగిలింది డిజిటల్ పేమెంట్ సంస్థలకు వెళ్తుందని తెలిపింది. జేపీ మోర్గాన్, సిటీ వంటి సంస్థలు కూడా సుమారుగా రూ.16,000 కోట్ల నుంచి రూ.17,000 కోట్ల వరకు ఆదాయం రావచ్చని విశ్లేషించాయి.

ఈ ఆదాయం యూపీఐ వ్యవస్థలోని జారీ చేసే బ్యాంకులు, అప్లికేషన్ ప్రొవైడర్ల మధ్య ఎలా పంపిణీ అవుతుందనే దానిపైనే ఏ సంస్థకు ఎంత లబ్ధి చేకూరుతుందనేది ఆధారపడి ఉంటుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు