Sunday, November 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరంలో ఎన్టీఆర్ వైద్య సేవ లు బంద్

ధర్మవరంలో ఎన్టీఆర్ వైద్య సేవ లు బంద్

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం; ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అధ్యక్షులు కే.విజయ్ కుమార్, కార్యదర్శి సిహెచ్. అవినాష్, ఉపాధ్యక్షులు ఎస్విఎల్. నారాయణరావు, టి. చంద్రమౌళీశ్వర రావు, కోశాధికారి నాగ మల్లేశ్వరరావు పిలుపుమేరకు ధర్మవరం పట్టణంలోని స్పందన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, దేవి నర్సింగ్ హోమ్ హాస్పిటల్ పూర్తిగా ఎన్టీఆర్ సేవలను బంద్ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రుల బతుకు భారమైందని నడక కష్టమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాలలో ఉన్న మా స్పెషాలిటీ హాస్పిటల్ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళినా కూడా ప్రయోజనం లేదు అని వారు స్పష్టం చేశారు. పేద ప్రజలకు అన్ని రకాలుగా సేవలను అందిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలను నిర్వహించడం మా ప్రధమ కర్తవ్యం అని, అలాంటప్పుడు మాకు రావలసిన నిధులు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుండి రావలసిన బకాయిలు సుమారు 2 వేల700 కోట్లు పై మాటేనని తెలిపారు. ఇటువంటి బకాయిలు నెలనెలా పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదని తెలిపారు. బకాయిల కోసం ప్రభుత్వాన్ని కలిసి పలుమాలు విన్నవించడం జరిగిందని, కానీ ఫలితం శూన్యమని వారు బాధని వ్యక్తం చేశారు. కేవలం ఆరోగ్యశ్రీ సేవలు మాత్రమే బంద్ చేయడం జరిగిందని, మిగిలిన వైద్య చికిత్సలు యధాతధంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. గత ఏడాదిగా తాము ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, ప్రజలంతా అర్థం చేసుకుంటారని వారు విన్నవించారు. ఇంతకాలం మీకు సేవ చేయడం జరిగిందని ఈ కష్టకాలంలో మాకు అండగా నిలవాలని వారు ప్రజల్ని కోరారు. ఆరోగ్యశ్రీ నిధులు ప్రభుత్వం వారు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు