Saturday, November 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచెరువులు నిండితే భూగర్భ జలాలు పెరుగుతాయి

చెరువులు నిండితే భూగర్భ జలాలు పెరుగుతాయి

- Advertisement -

జలవనరులు కాపాడితేనే భవిష్యత్ సురక్షితం

–మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం:గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ధర్మవరం చెరువు నిండిపోవడంతో పట్టణ ప్రజల్లో ఆనందం నెలకొంది. చెరువు మొదటి మరువ పారడం ప్రారంభమైన నేపథ్యంలో, శుక్రవారం మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు చెరువు మరువ వద్ద గంగపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ ధర్మవరం చెరువు నిండిపోవడం మా పట్టణానికి అభివృద్ధి సంకేతం అని తెలిపారు. ప్రకృతి కరుణతో పాటు, చెరువు పునరుద్ధరణకు సత్యకుమార్ యాదవ్ గారి నాయకత్వంలో చేపట్టిన ప్రయత్నాలు ఫలించినాయి అని అన్నారు. చెరువుల పునరుద్ధరణ, జల వనరుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతర కృషి చేస్తోంది అని అన్నారు. ధర్మవరం పట్టణ ప్రజలకు ఇది ఆనందదాయకమైన క్షణం. చెరువులు, కాలువలు నిండిపోవడం వ్యవసాయం, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ సమతుల్యతకు తోడ్పడుతుంది తెలిపారు. చెరువును కాపాడటంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు