ప్రిన్సిపాల్ సురేష్ బాబు
విశాలాంధ్ర -ధర్మవరం : భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ మైభారత్ అనంతపురం ప్రగతి పధం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు క్లస్టర్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ను నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల ప్రిన్సిపాల్ జే.వి. సురేష్ బాబు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత కే. జయ మారుతి, పీజికల్ ఎడ్యుకేషన్ ఇంచార్జ్ డైరెక్టర్ డా. ప్రదీప్, ఇంగ్లీష్ అధ్యాపకులు వై. రాజేష్ , ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. డి. మల్లికార్జున పాల్గొన్నారు.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు క్రీడలలో రాణించాలి అని పేర్కొన్నారు. అలాగే క్రీడల ద్వారానే మానసిక శారీరక ఆరోగ్యంఉంటుందన్నారు. అలాగే యువత సామాజిక మాధ్యమాలకు అలవాటు పడి శారీరక శ్రమ చేయటం లేదు కనుక కనీసం రోజులో కొంత సమయం క్రీడలకు మరియు శారీరక శ్రమ కోసం కేటాయించాలి అని తెలిపారు.ఈ సందర్భంగా క్రీడలలో గెలుపొందిన యువతకు కేంద్ర ప్రభుత్వం చే జారీచేసిన ప్రశంసా పత్రాలు, మెడల్స్ , ట్రోఫీలను బహుకరించారు, ఈ కార్యక్రమంలో ప్రగతి పధం యూత్ అసోసియేషన్ సభ్యులు పి. గోపి, అధ్యాపకులు, యువతీ యువకులు పాల్గొన్నారు.
యువతలో క్రీడా స్ఫూర్తిని కలిగించడానికి క్లస్టర్ లెవెల్ స్పోర్ట్స్ మీట్..
- Advertisement -
RELATED ARTICLES


