Tuesday, November 18, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅన్నదానం చేయుటలోనే నిజమైన సంతృప్తి, సంతోషం లభిస్తుంది..

అన్నదానం చేయుటలోనే నిజమైన సంతృప్తి, సంతోషం లభిస్తుంది..

- Advertisement -

కన్వీనర్ నామా ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; అన్నదానం చేయుటలోనే నిజమైన సంతృప్తి సంతోషం లభిస్తుందని శ్రీ సత్య సాయి సేవ సమితి- గాంధీ నగర్, కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 380 మంది రోగులకు, సహాయకులకు ప్రభుత్వ ఆసుపత్రి సిస్టర్లచే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమానికి దాతగా ఉపేంద్ర, కృష్ణవేణి వ్యవహరించడం పట్ల వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఆసక్తి గలవారు సెల్ నెంబర్ 9966047044 కు గాని 903044065కు గాని సంప్రదించాలని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్ మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవా సమితి వారు చేస్తున్న ఇటువంటి సేవలు ఎందరికో స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ప్రతి వ్యక్తి సేవా కార్యక్రమాలను అలవర్చుకున్నప్పుడే మానవతా విలువలు పెరుగుతాయని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి తరఫున సేవాసమితి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు