ఏపీ విలేజ్ అండ్ వార్డ్ సచివాలయ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా
విశాలాంధ్ర ధర్మవరం : సచివాలయ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ప్రభుత్వము చర్యలు చేపట్టాలని కోరుతూ ఏపీ విలేజ్ అండ్ వార్డ్ సచివాలయ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా పురపాలక సంఘ కార్యాలయంలోని కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మహబూబ్ బాషా మాట్లాడుతూ మూడు నెలలుగా ఇంక్రిమెంట్లు పెండింగ్లో ఉన్నాయని, బదిలీపై వచ్చిన ఉద్యోగుల పెండింగ్ జీతాలు చెల్లించాలని, అరియర్ బిల్లులు, మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులు వెంటనే ఆమోదించాలని వారు తెలిపారు. తమ న్యాయమైన హక్కులు దీర్ఘకాలికంగా వాయిదా పడటం విచారకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి..
- Advertisement -
RELATED ARTICLES


