విశాలాంధ్ర- వలేటివారిపాలెం : నట్టల నివారణ కార్యక్రమం ఆదివారం పోకూరు గ్రామములో నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పోకూరు పశు వైద్యులు డాక్టర్ యస్. సుధాకర్ పాల్గొని నట్టల నివారణ మందులు ప్రతి మూడు నెలలకు ఒక సారి క్రమం తప్పకుండా తాపించుకోవాలని డివర్మింగ్ తాపించడం వలన పొట్టలో ఉన్నా గుండ్రటి నులి పురుగులు, ఖార్జపు జలగలు, బద్దెపురుగులు నశించి ఆరోగ్యం ఉంటాయని రైతులకువివరించారు. బొబ్బ వ్యాధి (షీప్ ఫాక్స్) వైరస్ ద్వారా వ్యాపించే అంటు వ్యాధి కావున ముందస్తుగా గొర్రెల కాపరులు టీకాలు వేయించు కోవాలని సన్న జీవాల రైతులకు అవగాహన కలిపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సోమినేని తిరుమలరావు పాల్గొని ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ ద్వారా ఉచితంగా అందిస్తున్న డివర్మింగ్ మందులను, పశు గ్రాసాల సాగును, అలాగే పశువులు మరియు గొర్రెలు, మేకలకు ముందస్తుగా టీకాలు వేయించుకొని పశు సంపదను కాపాడుకోవాలని అలాగే పశు వైద్య సేవలను వినియోగిచుకోవాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమం లో రైతు సేవా కేంద్రం పశు వైద్య సహాయకులు మహిత,అశోక్ రైతులు పాల్గొన్నారు


