విశాలాంధ్ర- ధర్మవరం ; విద్యాశాఖ అధికారుల అసమ్మద్ద నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈనెల 11న డీఈఓ కార్యాలయం ఎదుట యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శెట్టిపి జయచంద్రారెడ్డి సుధాకర్ లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాడ్య ఫెడరేషన్ రాస్ట్ర శాఖ పిలుపు మేరకు శ్రీ సత్య సాయి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్మవరం లోని ఉప విద్యాశాఖధికారి కార్యాలయంనందు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కలవడం జరిగింది అని తెలిపారు. గత ప్రభుత్వ పరిపాలనకు, ఈ ప్రభుత్వ పరిపాలనకు పెద్దగా తేడా లేదనే విధంగా విద్యాశాఖ అధికారుల నిర్ణయాలు ఉంటున్నాయని ఆరోపించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆమిదాలగొందిలో పనిచేస్తున్న ప్రధానోపాద్యాయులు జాబేజ్ సస్పెండ్ గాని, పాఠశాలల పని వేళలను 5 గంటల వరకూ పెంపు విషయం కావచ్చు గాని, పదో తరగతి పరీక్షలకు సంసిద్ధత పేరుతో విడుదల చేసిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ గాని, ముఖ్యంగా కొన్ని మండలాల్లో 10 శాతం నుంచి ఉపాధ్యాయులు సెలవులు పెట్టరాదని మండల విద్యాశాఖ అధికారులు అత్యవసర సందర్భాల్లో కూడా సెలవులు మంజూరు చేయడం లేదు అని మండిపడ్డారు. అనారోగ్యం పడిన వారికి సైతం సెలవులు మంజూరు చేయకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురి అవుతున్న విషయం గాని, ఆదే విధంగా ఇప్పటికే విద్యార్థుల అపార్ నమోదు విషయంలో ఉపాధ్యాయులు పలు ఇబ్బందులు పడుతున్నారు అని, దీని వల్ల బోదనకు ఆటంకం కలుగుతున్నది అని వాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో ఆదివారాలు, పండుగ దినాల్లో సైతం పని చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వుల పట్ల గాని ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ అసంబద్ధ నిర్ణయాలు ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయి అని, విద్యాశాఖ అసంబద్ధ నిర్ణయాలను రద్దు చేయాలని డిమాండ్ తో ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ శ్రీ సత్యసాయి జిల్లా శాఖ నిరసన ప్రదర్శనలు చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. అందువలన ఈనెల 11వ తేదీ కొత్తచెరువు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శనలు చేస్తూ తదుపరి ఈనెల 16వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శనలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. తదుపరి వ్రాతపూర్వక నోటీసును డీఈవో కిష్టప్పకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. కావున విద్యాశాఖ నిర్ణయాలను పునః సమీషించాలని, ఒత్తడి లేని వాతావరణంలో ఉపాధ్యాయులు స్వేచ్ఛగా పనిచేసే విధంగా అధికారులు నిర్ణయాలు ఉండాలని వారు తెలిపారు. లేదు యెడల మా పోరాటాన్ని మరింత ఉధృతం చేయగలమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ మేరీ వర కుమారి, జిల్లా కార్యదర్శి లతా దేవి, నాయకులు రామకృష్ణ నాయక్, హరికృష్ణ, లక్ష్మయ్య, రాం ప్రసాద్, రామాంజనేయులు సాయి గణేష్, బిల్లే రామాంజనేయులు, హరిశంకర్, వెంకట కిషోర్, బాలగుండ్ల ఆంజనేయులు, నాగేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
11న డీ.ఈ.ఓ. కార్యాలయాల ఎదుట యుటిఎఫ్ నిరసన ప్రదర్శన
RELATED ARTICLES