శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలకు ఉచితంగా వైద్య చికిత్సలు అందించడమే మా లక్ష్యము అని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం కమిటీ వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో ఉచిత వైద్య చికిత్సలతో పాటు నెలకు సరిపడా మందులను కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు వేల్పుల వెంకటమ్మ, కీర్తిశేషులు వేల్పుల భూషప్ప జ్ఞాపకార్థం వీరి కుమారులు వేల్పుల వెంకటేశు అండ్ సన్స్ వారు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ శిబిరంలో వైద్య చికిత్సలను డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సాయి స్వరూప్, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ జైదీపు నేత వ్యవహరించడం జరుగుతుందన్నారు. కావున ఈ అవకాశాన్ని పట్టణము, గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యమును పదిలంగా ఉంచుకోవాలని తెలిపారు.
పేద ప్రజలకు ఉచిత వైద్య చికిత్సలు అందించడమే మా లక్ష్యం..
RELATED ARTICLES