విశాలాంధ్ర – ధర్మవరం : విద్యార్థి దశ నుంచే దేశభక్తిని పెంపొందించుకోవాలని, ఇటువంటి అవకాశం కేవలం ఎన్సిసి ద్వారానే సాధ్యమవుతుందని పట్టణ ప్రముఖులు, టిడిపి నాయకుడు సంధ రాఘవ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్సిసి విభాగం రావడం జరిగింది. ఈ ఎన్సిసి లో ప్రభుత్వం 50 మంది ఎన్సిసి నేర్చుకునే విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేసే భాగంగా ముఖ్యఅతిథిగా వారు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సంధ రాఘవ తో పాటు, పురుషోత్తం, హెడ్మాస్టర్ రామకృష్ణ, పిడి నాగేంద్ర, ఉపాధ్యాయులు నాగరాజు, లైన్స్ క్లబ్ చైర్మన్ వేణుగోపాలాచార్యులు పాల్గొన్నారు. అనంతరం పాఠశాల పిడి నాగేంద్ర, హెడ్మాస్టర్ అండ్ లయన్స్ క్లబ్ చైర్మన్ వేణుగోపాలచార్యులు తొలుత ఎన్సిసి విభాగము, దాని యొక్క ప్రాధాన్యత, భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న వివరాలను తెలియజేశారు. తదుపరి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సంద రాఘవ మాట్లాడుతూ తాను కూడా ఈ పాఠశాలలో పూర్వ విద్యార్థి అని, అప్పటి కాలంలో ఎన్సిసి లేదని, నేడు పట్టణంలోని ఏ పాఠశాలలో లేని ఈ ఎన్సిసి విభాగం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయడం నిజంగా గర్వించదగ్గ విషయమని, ఇందుకు కృషి చేసిన పిడి నాగేంద్రను వారు అభినందించారు. ఎన్సిసి స్థాయిలో విద్యార్థులకు భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారుతుందని, దేశభక్తిని పెంపొందిస్తూ, చక్కటి క్రమశిక్షణకు మారుపేరు ఎన్సిసి అని వారు తెలిపారు. ఈ పాఠశాలకు మున్ముందు నా వంతు సహాయ సహకారాలు తప్పక అందిస్తారని వారు హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర, స్థాయిలలో ఎన్సిసి విభాగం పలు పాఠశాలలలో ఉందని, అందులో ధర్మవరం ప్రభుత్వ బాలల అనంత పాఠశాలలో ఉండడం ఒక ప్రత్యేకతను సంతరించుకుందని తెలిపారు. యువతలో నిస్వార్థ సేవ ఎన్సిసి నేర్పిస్తుందని తెలిపారు. ఐక్యమత్యము క్రమశిక్షణకు మారుపేరు ఎన్సిసి అని తెలిపారు. పాఠశాలలో లోని 50 మంది ఎన్సీసీ విద్యార్థులకు రూ.2,31,000 విలువచేసే యూనిఫార్ములను వారు చేతులు మీదుగా అందజేశారు. అనంతరం పాఠశాల హెడ్మాస్టరు ఉపాధ్యాయ బృందం సంధ రాఘవా ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


