Wednesday, December 11, 2024
Homeఆంధ్రప్రదేశ్లాన్ టెన్నిస్ పోటీలకు పిఈటి శివకృష్ణ ఎంపిక

లాన్ టెన్నిస్ పోటీలకు పిఈటి శివకృష్ణ ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం పట్టణానికి చెందిన పిఈటి శివకృష్ణ ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయిస్ లాంగ్ టెన్నిస్ పోటీలకు ఎంపిక కావడం జరిగింది. వీరు కొత్తచెరువు మండలం కేసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిఈటిగా విధులు నిర్వహిస్తున్నారు.విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 6వ తేదీ లా అండ్ టెన్నిస్ పోటీలు జరిగాయి. ఇందులో భాగంగానే శ్రీ సత్యసాయి జిల్లా నుంచి పోటీల్లో పాల్గొన్న శివకృష్ణ మూడు మ్యాచుల్లో నెగ్గి రెండో స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక కావడం కూడా జరిగింది. ఈ ఎంపిక పట్ల మండల విద్యాశాఖ అధికారులతో పాటు తోటి ఉపాధ్యాయ బృందము పిఈటి బృందము బంధుమిత్రులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు