-డీఎస్పీహేమంత్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం: సమస్యల పరిష్కారానికి పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని డిఎస్పి హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ డీఎస్పీ హేమంత్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పి తో పాటు వన్టౌన్ ఎస్ఐ.ఉమాదేవి, ఎస్సై జయ రామ నాయక్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సభ్యులు లాయర్ భార్గవి, ఐసిడిఎస్ సూపర్వైజర్ భవాని, రిటైర్డ్ హెడ్మాస్టర్ చలపతి, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ హరి శ్రీనివాస్, పాత్రికేయులు రాఘవ కలిసి కౌన్సిలింగ్ సెంటర్ కు వచ్చిన పలు కేసులను విచారణ చేపట్టి, తగిన కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అనంతరం డిఎస్పీ హేమంత్ కుమార్ మాట్లాడుతూ మొత్తం ఐదు భార్యాభర్తల ఫిర్యాదులు రావడం జరిగిందని, దాదాపు ఉదయం 11:00 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరంగా కౌన్సిలింగ్ చేపట్టిన తర్వాత రెండు కేసులు రాజీ కావడం జరిగిందని, మరో మూడు వచ్చే శనివారమునకు వాయిదా వేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్
- Advertisement -
RELATED ARTICLES


