Friday, March 6, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివైయస్సార్సీపి పాలనలో భూ సర్వేలో భారీ అవక తవకలు

వైయస్సార్సీపి పాలనలో భూ సర్వేలో భారీ అవక తవకలు

- Advertisement -

-మంత్రి సత్య కుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్

విశాలాంధ్ర ధర్మవరం: వైయస్సార్సీపి పాలనలో భూ సర్వే లో భారీ అవకతవకలు జరిగాయని ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని రావుల చెరువులో మీ భూమి-మీ హక్కు కార్యక్రమాన్ని వారు ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వా రాజముద్రతో కలిగిన పట్టాదారు పాసుపుస్తకాలు వారిచేత మీదుగా పంపిణీ చేశారు. అనంతరం సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ రైతులకు పూర్తి న్యాయం చేకూర్చడమే మీ భూమి మీ హక్కు కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యము అని తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత పాలనలో జరిగిన భూ అవకతవకలను సరిదిద్దే దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల భూమికే వైయస్సార్సీపి ఎసురు పెట్టడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఖచ్చితమైన రీ సర్వే చేసి ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కారం చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా అమలు చేయాలని లక్ష్యంతోనే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రైతుల భూములను హక్కులను కాపాడటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపు కల్పన చేసి అమలు చేస్తున్నామని వారు స్పష్టం చేశారు. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో చేపట్టిన రీసర్వే కార్యక్రమం రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేష్, తాసిల్దార్ సురేష్ బాబు, రెవెన్యూ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, ఎన్డీఏ కూటమి నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు