- Advertisement -
ప్రముఖ సినీ నటి రాధికా శరత్ కుమార్ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.జ్వరంతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు జూలై 28న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.ఈ వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. వైద్య పరీక్షల్లో రాధికకు డెంగ్యూ వైరస్ సోకినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.ప్రస్తుతం ఆమెకు అవసరమైన చికిత్స అందుతున్నదని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.వైద్యుల సూచనల ప్రకారం, రాధికకు ఆగస్టు 5వ తేదీ వరకు చికిత్స కొనసాగాల్సి ఉంటుందని, అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేయనున్నట్లు సమాచారం.


