విశాలాంధ్ర – గోపాలపురం : విద్యార్థి స్థాయి నుండి వృద్ధుల వరకు సెల్ఫోన్ వాడనటువంటివారు నేటి కాలంలో లేరు. ఒక ఇంటికి ఒకటి లేక రెండు టాయిలెట్లు ఉండవచ్చు ఏమో కానీ ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి ఫోన్లు అందుబాటులోకి వచ్చిన నేటి కాలంలో ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిన తరుణంలో ప్రతి వ్యక్తి ఫోన్ కొనుక్కొని దాని వినియోగించుటకు అవసరమైన నెట్వర్క్ గల సిమ్ కార్డులను తీసుకొని ఇతర వ్యక్తులతో సంభాషణలు గానీ యూట్యూబ్ ద్వారా వచ్చే అనేకమైన ప్రపంచ స్థాయి సంగతులను గాని వీక్షించడం నేటి కాలంలో పరిపాటి అయిపోయింది. సెల్ ఫోన్లు పనిచేయకపోతే మనిషి ఎంత నిరాశ నిస్పృహాలతో కొట్టుమిట్టాడు తాడో ఇటీవల కొన్ని సంఘటన కూడా చూస్తున్నాం. నెట్వర్క్ సమస్యలు ఎదురైతే ఆ ఫోన్లను విసిరి పారేయడం వంటి సంగతులు యువత లో కొన్ని సందర్భాలలో ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఆ సెల్ ఫోన్ సిగ్నల్ సమస్యలు నిరంతరాయంగా ఎదురవుతుంటే సెల్ఫోన్ వినియోగదారులకు ఎంత కోపమైన రావడం జరుగుతుంది. మండలంలోని వాదాలకుంట గ్రామంలో ఒకటి, విధులు కుంటకు సమీపంలో మరొకటి గత కొన్నేళ్ల క్రితం 2 టవర్లు ఆయా నెట్వర్క్ట కపెనీలు నిర్మాణాలు చేపట్టి ప్రజలకు సెల్ఫోన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ టవర్లపై ఎయిర్ టెల్ బి ఎస్ ఎన్ ఎల్, వోడాఫోన్ ఐడియా తో పాటు జియో నెట్వర్క్ సేవలు అందిస్తున్నారు. దీనిని నిర్వహించడానికి, ప్రజలకు సెల్ ఫోన్ సేవలు విస్తరించుటలో భాగంగా నిర్వాహకులను కూడా నియమించారు. కాలక్రమేనా ఆయా నెట్వర్క్ సంస్థలు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో నిర్వాహకులను తొలగించి ఆటోమేటిక్ జనరేటర్ లను ఆయా టవర్ల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల కొంతకాలంగా జనరేటర్ల మెయింటినెన్స్ ఆయా నెట్వర్క్ సంస్థలు చేపట్టకపోవడంతో జనరేటర్లు పనిచేయక కరెంటు ఉన్నంత సేపు వినియోగదారుల ఫోన్లు సజావుగా పనిచేసినప్పటికీ కరెంటు కట్ అవడంతో సెల్ ఫన్లు గబోతున్నాయని ఆయా నెట్వర్క్ సిమ్ కార్డులను ఉపయోగించే వినియోగదారులు గగోలు పెడుతున్నారు. సంబంధిత నెట్వర్క్ సంస్థల అధికారులు దీనిపై దృష్టించి సెల్ఫోన్ వినియోగదారులకు నిరంతర ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని వాదాలకుంట, వెదుళ్ళకుంట గ్రామాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు.
పవర్ కట్ సెల్ సిగ్నల్ హమ్ ఫట్
- Advertisement -
RELATED ARTICLES


