విశాలాంధ్ర–నంబులపూలకుంట: కార్యకర్తల సంక్షేమం, అభ్యున్నతికే ఎల్లప్పుడూ కృషి చేసే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ఆక్టివిటీ కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక శివాలయం సమీపంలోని కమ్యూనిటీ భవనంలో మండల కన్వీనర్ కొత్త రంగారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసులు రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వర్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ విభాగం కార్యదర్శి పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మండల పరిశీలకులు బత్తల హరిప్రసాద్ హాజరై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వజ్ర భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, మండల పరిధిలో సుమారు 1,500 మందితో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలకు సంస్థాగత నిర్మాణంలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి కమిటీల ఎంపిక చేపడతామని, అనుబంధ విభాగాల కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళలు, యువతకు కమిటీల్లో కీలక స్థానం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చే వరకు సోషల్ మీడియా విభాగం అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.ప్రజలతో మమేకమై వారి సమస్యలపై స్పందించే వారికి కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మండల సీనియర్ నాయకులు జగదీశ్వర్ రెడ్డి, బాలకృష్ణ నాయుడు, ఎంపీటీసీలు, సర్పంచులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నిబద్ధత కలిగిన కార్యకర్తలకే ప్రాధాన్యం: వజ్ర భాస్కర్ రెడ్డి
- Advertisement -
RELATED ARTICLES


