Homeజిల్లాలుఅనంతపురంఅంగన్వాడి వర్కర్స్–హెల్పర్స్ సమస్యల పరిష్కారానికి కృషి..

అంగన్వాడి వర్కర్స్–హెల్పర్స్ సమస్యల పరిష్కారానికి కృషి..

- Advertisement -

విశాలాంధ్ర–తాడిపత్రి: అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి జె. రాజారెడ్డి, ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె. లలితమ్మ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని రమణ మహర్షి ఆశ్రమంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.నూతనంగా ఎన్నికైన ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ తాడిపత్రి కన్వీనర్ ఎల్. జ్యోతిలత, కో-కన్వీనర్ జి. నాగేశ్వరమ్మ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ తాడిపత్రి నూతన అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఈ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి జె. రాజారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె. లలితమ్మతో పాటు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్. రాజేష్ గౌడ్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి టి. రంగయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్, ఉమ్మడి జిల్లా ఏఐటీయూసీ అంగన్వాడి నాయకురాలు మాబునిసా, హిందూపురం ఏఐటీయూసీ అంగన్వాడి నాయకురాలు సంపూర్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడి వేతనాల పెంపు, అంగన్వాడి కేంద్రాల అద్దెల పెంపు, మినీ అంగన్వాడీలను ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయడం వంటి సమస్యలపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించి సాధించామని తెలిపారు. డిమాండ్ల సాధన కోసం కూడా సంఘటితంగా ఉద్యమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

నూతన కమిటీ ఎన్నిక…

ఈ సమావేశంలో ఏఐటీయూసీ తాడిపత్రి నూతన అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కన్వీనర్ గా ఎల్. జ్యోతిలత కో-కన్వీనర్ గా జి. నాగేశ్వరమ్మ కమిటీ సభ్యులు గా హాస్పిటల్ పాలెం సెక్టార్ లీడర్స్ కె. శంకరమ్మ, జి. హైమావతి, వై. గౌరీ, ఎన్. లక్ష్మీకాంతమ్మ; పప్పూరు సెక్టార్ లీడర్స్ పి. రాజేశ్వరి, పి. రామలక్ష్మమ్మ, ఏ. సుశీల; చుక్కలూరు సెక్టార్ లీడర్ ఎం. విజయలక్ష్మి; ఆర్వి పల్లి సెక్టార్ లీడర్స్ ఈ. అమ్మని, కె. రమణమ్మలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులు నాగేంద్ర, శ్రీరాములు, ఏఐటీయూసీ నాయకులు రమణ, శ్రీనివాసులు, రత్నమయ్య, అబ్రహం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు