-ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ చేస్తున్న నాయకులు
విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు); మండల పరిధిలోని హులికన్వి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు గ్రామ సర్పంచ్ చిన్న మహదేవ, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీల్లో మొత్తం 12 మంది మహిళలు పాల్గొన్నారు. వీరిలో మొదటి స్థానంలో వెంకటలక్ష్మి, రెండో స్థానంలో తలారి అంజలి, మూడో స్థానంలో నాగవేణి నిలిచారు. మొదటి స్థానంలో నిలిచిన వెంకటలక్ష్మికి 2500 రూపాయలు ఓబులేశు, రెండో స్థానంలో నిలిచిన తలారి అంజలికి 2000 రూపాయలు ఈడిగ వెంకటేశ్వర్లు గౌడ్, మూడో స్థానంలో నిలిచిన నాగవేణికి 1500 రూపాయలు గవిగట్టు తిమ్మప్పలు బహుమతులు అందజేశారు. అలాగే నాల్గో స్థానంలో నిలిచిన సింధూకు 1000 రూపాయలు తలారి సంతోషమ్మ, ఐదో స్థానంలో నిలిచిన లక్ష్మీకుమారికి 1000 రూపాయలు బాపులదొడ్డి నర్సిరెడ్డి, ఆరోస్థానంలో నిలిచిన దేవేంద్రమ్మకు 1000 రూపాయలు బాపులదొడ్డి మహదేవ, ఏడో స్థానంలో నిలిచిన జ్యోతికి 500 రూపాయలు అందజేశారు. మిగిలిన 5 మంది మహిళలకు ప్లేట్లు బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గవిగట్టు గ్రామ సర్పంచ్ నాగరాజు, పీకలబెట్ట వైసీపీ నాయకులు మూకిరెడ్డి, యల్లప్ప, కడబూరి, తిమ్మప్ప, టీడీపీ నేతలు హనుమంతు, ఓబులేశు, గ్రామ పెద్దలు పెద్ద మహదేవ, తిమ్మప్ప, నల్లారెడ్డి, మహిళలు పాల్గొన్నారు.


