-మంత్రి సత్య కుమార్ యాదవ్ దంపతులు నగదు బహుమతులు అందజేశారు.
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సంక్రాంతి సంబరాలు సాంప్రదాయ క్రీడలు పోటీలు ఘనంగా ఎన్డీఏ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ దంపతులు, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కోడి పందాలు ,రాతి దూలం లాగుట, మహిళల ముగ్గుల పోటీలు, మహిళల కబడ్డీ, 120 కిలోల ఇసుక సంచులను ఎత్తే పోటీలను వారు అధికారికంగా ప్రారంభించారు. మహిళల ముగ్గుల పోటీలలో ప్రథమ బహుమతికి 25,000, ద్వితీయ బహుమతికి 15000, తృతీయ బహుమతిగా 10,000 రూపాయలు మంత్రి సతీమణి, ఎస్పీ సతీష్ కుమార్ సతీమణి ధరణ్య చేతులమీదుగా నగదు బహుమతులను అందజేశారు. మహిళల కబాడీ పోటీలలో మొత్తము 7 జట్లు పాల్గొనగా ఫైనల్స్లో ధర్మవరం కబడ్డీ జట్టు అనంతపురం కబడి చెట్లతో తలపడగా ధర్మవరం జట్టు విజేతగా నిలిచింది, అనంతపురం జట్టు రన్నర్పుగా నిలిచింది. విజేతగా నిలిచిన ధర్మారం జట్టుకు 25వేల రూపాయల ప్రధమ బహుమతి రన్నర్పుగా నిలిచిన అనంతపురం జట్టుకు 15వేల రూపాయల బహుమతులను కూడా అందజేశారు. అలాగే 120 కిలోల ఇసుక సంచులను ఎత్తే పోటీల్లో దుర్గ విజేతగా నిలిచి 15 వేల రూపాయలు ప్రథమ బహుమతి పొందగా, రాముడు ద్వితీయ బహుమతిగా పదివేల రూపాయలు, నరేష్ తృతీయ బహుమతిగా ఐదు వేల రూపాయలు పొంది నగదు బహుమతులను దంపతులు చేతులు మీదుగా అందుకున్నారు. అనంతరం కళాకారులు ఎన్డీఏ నాయకులకు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం మాకు ఎంతో సంతోషదాయకమని తెలుపుతూ వారు కృతజ్ఞతలు తెలియజేశారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రతిభ కనిపించిన కళాకారులకు నగదు బహుమతులు
- Advertisement -
RELATED ARTICLES


