విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలం కృష్ణా రెడ్డి గ్రామంలో రైల్వే బ్రిడ్జి వద్ద పొలములలో సిమెంట్ పోల్స్ ను అమర్చే పనిలో భాగంగా కూలీలుగా శివం అనే కూలీతో పాటు అన్న బ్రిడ్జు, మరో తమ్ముడు డీఫిన్(ముగ్గురు) పనిచేస్తూ గత 25 రోజులుగా జీవనం కొనసాగించేవారు. ఇందులో భాగంగా శివం (27) తన భార్య సాధనతో ఆర్థిక సమస్యలతో మాట్లాడుతూ, ఆ సమస్యలు తీరకపోవడంతో ఏం చేయాలో తోచక బుధవారం అర్ధరాత్రి సమయంలో శివం అనుకోకుండా అందరూ నిద్రిస్తుండగా బయటికి వెళ్లిపోయాడు. తదుపరి ఓ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున రైల్వే గేట్మెన్ చూసి సమాచారాన్ని రైల్వే పోలీసులకు అందించారు. తదుపరి ధర్మవరం ఆర్పిఎఫ్ ఎస్ఐ రోహిత్ కుమార్, జిఆర్పి హెడ్ కానిస్టేబుల్ చాంద్బాషా ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం చుట్టుపక్కల గ్రామాలలో వారు విచారణ చేయగా, ముగ్గురు అన్నదమ్ముల్లో అన్న బ్రిడ్జూ తన తమ్ముడే శివాని గుర్తుపట్టాడు. అనంతరం రైల్వే పోలీసులు శవానికి పోస్టుమార్టం చేయించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. తదుపరి ఆర్పిఎఫ్ , జి ఆర్ పి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆర్థిక సమస్యలతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కూలి రైలు కిందపడి ఆత్మహత్య
- Advertisement -
RELATED ARTICLES


