-మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణ
విశాలాంధ్ర ధర్మవరం; భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ దేశాలకు సైతం ఆదర్శప్రాయంగా నిలిచాయని మున్సిపల్ కమిషనర్ సాయికృష్ణ తెలిపారు. భోగి, సంక్రాంతి పండుగ పర్వదిన సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక తేరు వద్ద సంక్రాంతి సంబరాలు లో భాగంగా భోగి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణ మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో విశిష్టత కలిగి ఉన్నాయని ప్రపంచ దేశాలకు సైతం ఆదర్శంగా నిలిచాయన్నారు. ఒక్కో పండుగకు ఒక్కో విశిష్టత ఉందని, సంక్రాంతి పర్వదినానికి సైతం ఎంతో విశిష్టత ఉందని నేటితరం మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు కలవల నాగ తేజ, అంబటి అవినాష్, వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు పో డమల రూపరాగిణి, నల్లపేట మంజు సంయుక్త, వాసవి క్లబ్ అధ్యక్షులు కాకుమాని వెంకట సాయి, కార్యదర్శి నాగ వినయ్, కోశాధికారి గుండా గణేష్, డిస్టిక్ రీజినల్ కార్యదర్శి సనత్ కుమార్, కోటి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవిసంకీర్తన మహిళా మండలి, నగర సంకీర్తన బృందం
సభ్యులు పాల్గొన్నారు.
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయం
- Advertisement -
RELATED ARTICLES


