విశాలాంధ్ర – కొవ్వూరు: రైల్వేస్టేషన్లో 2019కి ముందు ఉన్న 34 రైలు హోల్డ్ ను యధావిధిగా పునర్దించాలని రైల్వే పరిరక్షణ సమితి సభ్యులు ఆదివారం నిరసన తెలియజేశారు. కొవ్వూరు రైల్వే సమితికి మద్దతు పలికిన కొవ్వూరు కు చెందిన యూనిటీ అండ్ స్ట్రెంగ్త్ అసోసియేషన్* సభ్యులు..కొవ్వూరు పట్టణం యొక్క పునర్వైభవమ్ కోసం ఆదివారం కొవ్వూరు రైల్వే స్టేషన్ ఎదురుగా నిరసన తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తొందర్లో రైల్వే హోల్డ్ పై స్పందన లేకపోతే నిరాహార దీక్ష చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు విల్సన్ రాజు, చామర్తి విశ్వనాధం, వల్లూరి రవి, వివి రావు, రాజేష్ జైన్, వైకే శ్రీనివాస్ మరియు దారం హరి, సాకా పుల్లారావు తదితరులు పాల్గొన్నారు
2019 రైళ్ల హాల్ట్ కోసం నిరసన
- Advertisement -
RELATED ARTICLES


