బాధ్యత విస్మరిస్తున్న నియంత్రణ మండలి..
జి. కోటేశ్వరరావు
విశాలాంధ్రవిజయవాడ: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అనేది స్వతంత్ర వ్యవస్థ గా నడపాల్సిన బాధ్యత విస్మరించి పాలకుల లోపభూయిష్ట ఆర్థిక విధానాలు అమలు చేసే వ్యవస్థగా మారిందని సీపీఐ నగర సమితి కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆరోపించారు. 2026 - 2027 ఆర్థిక సంవత్సర ఆదాయ అవసరాల రిటైల్ ధరలపై నియంత్రి మండలి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ శుక్రవారం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళక్షేత్రం లో నిర్వహించింది. ఈ సందర్భంగా సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం జి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సమీక్షా సమావేశం మొక్కుబడిగా నిర్వహిస్తూ ప్రజాభిప్రాయాలను బుట్టదాఖలు చేస్తూ పాలకులు, ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచాము, ట్రూ అప్ చార్జీలు రద్దు చేస్తాము, గత వైసిపి ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేస్తాము అలాగే స్మార్ట్ మీటర్లను రద్దు చేస్తాము అని ఇచ్చిన హామీలు గుర్తు లేవా ? అని ప్రశ్నించారు ఎన్నికల సమయంలో మన సకల శాఖ మంత్రి లోకేష్ ఒక అడుగు ముందుకేసి స్మార్ట్ మీటర్లను మేము వ్యతిరేకిస్తాము స్మార్టుమీటర్లను ఎవరైనా పెడితే పగలగొట్టండని చెప్పి నేడు స్మార్ట్ మీటర్లను ప్రజలు, వామపక్షాలు వ్యతిరేకిస్తుంటే వారిపై కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగంపైనే కాకుండా ట్రూ అప్ , సర్దుబాటు వంటి వివిధ చార్జీల పేరుతో వేల కోట్ల రూపాయల భారాన్ని సాధారణ పేద, మధ్య తరగతి ప్రజలపై భారాన్ని మోపే విధానాల్ని వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు విద్యుత్ అనేది నేడు ప్రజల మౌలిక అవసరాలలో భాగం అయినా తరుణంలో ప్రజలకు, రైతుల అవసరాలకు అవసరమైన విద్యుత్ అందిచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది అని స్పష్టం చేశారు. విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మెన్ వినతిపతం..
్డి వ్రిద్యుత్ ధరలను నియంత్రిచాలి, ట్రూ అప్ మరియు సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని, అలాగే విద్యుత్ ఒప్పందాలపై సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ బి.వెంకటరామిరెడ్డికి సీపీఐ బందం వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శులు లంకా దుర్గారావు, నక్కా వీరభద్రరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె.వి.భాస్కరరావు, తాడి పైడియ్య, అప్పరబోతూ రాము, కొట్టు రమణారావు, డి.వి రమణబాబు, తూనం వీరయ్య, ఓర్సు భారతి, సింగ రాజు సాంబ శివ రావు,నగర నాయకులు అలీ, కొండేటి శ్రీనివాసరావు, మూలి శ్రీమన్నారాయణ, రవి కుమార్, చింతాడ పార్వతి, బొర్రా రామకృష్ణ, మేకా దుర్గారావు, ఆకుల ఏసు, గాడి దుర్గారావు, మద్దెల గురునాధం, ఆంజనేయులు, మన్యం సుబ్బయ్య, నక్కా రాజ్య లక్ష్మి, దుర్గాసి రమణమ్మ, భాగ్య లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.


