Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లావచ్చే నెల 9న ఏపీయంసీ ఎన్నికలు

వచ్చే నెల 9న ఏపీయంసీ ఎన్నికలు

- Advertisement -


విశాలాంధ్ర`విజయవాడ: రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికలను నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడంపై వైద్య వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఏపీయంసీ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ నంద కిషోర్ , డాక్టర్ కార్తీక్ నేతృత్వంలోని డాక్టర్స్ డెమోక్రటిక్ ప్యానెల్ అభ్యర్థులు శుక్రవారం తాడేపల్లిలోని కార్యాలయంలో నామినేషన్లను దాఖలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నంద కిషోర్ మాట్లాడుతూ వచ్చే నెల ఫిబ్రవరి 9వ తేదీన ఎన్నికలు జరగనున్నాయని, చరిత్రలో మొదటిసారిగా ఈ ఎన్నికలను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ ప్యానెల్ తరపున మొత్తం 13 మంది సభ్యులు బరిలో నిలుస్తున్నారు. గతంలో మేము తీసుకువచ్చిన సంస్కరణలను దృష్టిలో ఉంచుకుని, వైద్యుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని పేర్కొన్నారు. డాక్టర్ కార్తీక్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 1.35 లక్షల మంది వైద్యులు రిజిస్టర్ అయి ఉండగా, ప్రస్తుతం 55 వేల మందికి పైగా వైద్యులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ జయధర్,డాక్టర్ ఆరవ వెంకట సుబ్బారెడ్డి, డాక్టర్ అవ్వరు అర్జున్ కుమార్, డాక్టర్ ఐ వాణి, డాక్టర్ జయశేఖర్, డాక్టర్ చిట్ల కిరణ్ కుమార్, డాక్టర్ లంకా శ్రీనివాస్ రావ్, డాక్టర్ షేక్ మస్తాన్ బాషా, డాక్టర్ బిజీ రాహుల్, డాక్టర్ పిడుగు విజయ భాస్కర్, డాక్టర్ ఓ మనోరంజాన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు