Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజాయింట్ ఎల్ పి ఎం ల సమస్యల పరిష్కార దిశగా ఆర్డిఓ ప్రత్యేక చర్యలు..

జాయింట్ ఎల్ పి ఎం ల సమస్యల పరిష్కార దిశగా ఆర్డిఓ ప్రత్యేక చర్యలు..

- Advertisement -

ఆర్డిఓ మహేష్
విశాలాంధ్ర ధర్మవరం;రీ సర్వే తర్వాత పలు గ్రామాలలో ఏర్పడిన జాయింట్ ఎల్ పి ఎం లకు సంబంధించిన సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు, ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది అని ఆర్డిఓ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, సంబంధిత గ్రామాల్లో రైతులు , దరఖాస్తుదారుల నుండి జాయింట్ ఎల్ పి ఎం లకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి, అక్కడికక్కడే ఈ-ఫైల్ చేయించడం జరిగిందన్నారు.సమర్పించిన దరఖాస్తులను ఒక వారం లోపు పరిష్కరించి స్పష్టత ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ ప్రత్యేక డ్రైవ్‌ను దశలవారీగా అన్ని గ్రామాలలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జాయింట్ ఎల్ పి ఎంల సమస్యలకు త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కారం లభిస్తున్నదని డివిజన్ లోని పలువురు రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు