విశాలాంధ్ర పుట్టపర్తి: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26వ తేదీ ఉదయం 11.30 గంటలకు అన్ని శాఖా కార్యాలయాలలో రాజ్యాంగ ప్రస్థావనను సామూహికంగా చదవాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు.“సంవిధాన దినోత్సవాన్ని ప్రతి ప్రభుత్వ శాఖ, కార్యాలయం, సంస్థలో తగిన గౌరవంతో నిర్వహించాలి. రాజ్యాంగ విలువలపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం ఎంతో ప్రాముఖ్యమైనది” అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సామూహిక పఠన కార్యక్రమం అన్ని విభాగాల్లో నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.జిల్లా పోలీస్ శాఖ, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు తమ పరిధిలోని అధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా సూచించారు.ప్రతి విభాగం తమ పరిధిలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, అనంతరం వివరాల నివేదికలను సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
రాజ్యాంగ ప్రస్తావనను సామూహికంగా చదవండి:–జిల్లా కలెక్టర్
- Advertisement -
RELATED ARTICLES


