ఘనంగా ఏఐటీయూసీ 106 వ ఆవిర్భవ దినోత్సవం
కార్మికులకు విప్లవ శుభా కాంక్షలు తెలియజేసిన
ఏ ఐ.టి..యు.సి. రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు రేఖా భాస్కరరావు
విశాలాంధ్ర – నిడదవోలు : ఏఐ.టి.యు.సి 106 వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిడదవోలులో ఎ.ఐ.టి.యు.సి. ఏరియా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భముగా పలు కార్మిక సంస్థల వద్ద ఎ.ఐ.టియుసి పతకాల్ని ఆవిష్కరించిన ఎ.ఐ.టి.యు.సి నాయకులు కార్యకర్తలు నిడదవోలు మెయిన్ రోడ్ లో పొట్టిశ్రీరాములు విగ్రహము వద్ద శ్రీ వెంకటేశ్వరా జట్ల సంఘం ఆధ్వర్యంలో ఎ. ఐ.టియుసి పతకాన్నిఎ.ఐ.టి.యు.సి. నాయకులు రేఖా భాస్కరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భముగా రేఖా భాస్కరరావు మాట్లాడుతూ 1920 అక్టోబరు 31 వ తేదీన ఏర్పడిన ఎ.ఐ.టి.యు.సి. దేశం లోనే ప్రప్రథమ కార్మికసంస్థ అని స్వాతంత్ర్యపోరాటములో ఎ.ఐ.టియుసి కీలక పాత్ర పోషించిందని. శ్రామిక హక్కుల పరిరక్షణలో ఎ.ఐ.టి.యు.సి. పాత్ర మరువ లేనిదన్నారు .కార్మిక చట్టాల రూప కల్పనలో , కార్మిక హక్కుల పరిరక్షణలో ఎ.ఐ.టి.యు.సి. పాత్ర చిరస్మరణీయమని , ప్రస్తుతం కేంద్రంలో మతోన్మాద బి.జె.పి. ప్రభుత్వం కార్మిక హక్కుల పై దాడి చేస్తుందని, కార్పోరేట్లు కు అనుకూలంగా 44 కార్మిక చట్టాలను 4, కోడ్ లు గా మార్చిందని, యిప్పటికే 29 కార్మిక చట్టాలు రద్దుచేసిందని , విశాఖ స్టీల్ సహా దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు పూనుకున్నదని , దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఆదివాసీలు,గిరిజనులు, దళితులు,మహిళలు , మైనారీటిల పై దాడులు పెరిగాయని, కేంద్రం లో బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని , దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నదని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నరేంద్రమోదీ కి అనుకూలంగా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నదని, కార్పొరేట్లును ప్రసన్నం చేసుకోవటానికి 12 గంటల పనిదినానికి చట్టం చేసిందని , విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ను నిలుపుదల చేయడంలో ఘోరంగా విఫలమయిందని, ప్రత్యేక హోదా మాటే మార్చి పోయిందని , ఎన్నికల వాగ్దానాలు అమలులో విఫలమైందని, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు భవిష్యత్ పోరాట కార్యక్రమానికి ఏఐటీయూసీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపిచ్చారు -కార్యక్రమంలో ఎ. ఐ.. టి.యు.సి, నాయకులు మాముడూరి నాగేంద్ర వర ప్రసాద్ , మెయిలి శ్రీను, రామిశెట్టి సత్తిబాబు, బీజా అప్పారావు,కోసూరి శ్రీను,, మామిడిసన్యా సిరావు, రొంగల శ్రీను, పెంటపాటి వెంకట్రావు, బద్ది సూరిబాబు,చోడిశెట్టి లోవరాజు , జల్లా వెంకటేశులు, నంద్యాల వీర్రాజు పొలిమాటి తాతబ్బాయి,, గాడిరవి, ఖండవల్లి మాణిక్యం,క్రొవ్విడి నాగరాజు, క్రివ్విడి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.


