Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపెండింగ్ బకాయిలు త్వరగా విడుదల చేయండి

పెండింగ్ బకాయిలు త్వరగా విడుదల చేయండి

- Advertisement -

ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యం
విశాలాంధ్ర ధర్మవరం;పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం నుండి త్వరగా విడుదల అయ్యేలా చూడాలని ప్రైవేటు డిగ్రీ కళాశాల సంఘం వారు మంత్రి కార్యాలయ ఇంచార్జ్ హరీష్ బాబుకు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023-24 , 2024-25,2025-26 విద్యా సంవత్సరాలకు సంబంధించి కేవలం 1 1/2 టర్మ్ ఫీజును మాత్రమే విడుదల కావటం జరిగిందని, గత 18 నెలలుగా రియంబర్స్మెంట్ రాకపోయినా ప్రభుత్వ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సహకారాన్ని అందించటం జరిగిందన్నారు.ప్రభుత్వం ఫీజులను కళాశాలల ఖాతాలకే జమ చేస్తామని చెప్పినందున విద్యార్థుల నుండి తాము వసూలు చేయటం లేదని, అప్పులు చేసి అధ్యాపకులకు జీతాలు చెల్లించామని తెలిపారు. ఇప్పుడు అప్పులు కూడా ముట్టని స్థితి ఉందని, కావున వీలైనంత త్వరగా బకాయిలను విడుదల చేసి విద్యా వ్యవస్థను కాపాడాలని వారు కోరారు. హరీష్ బాబు మాట్లాడుతూ తప్పకుండా మంత్రి కి మీ విషయం చెప్పి, మీకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కరణం హర్షవర్థన్, పద్మావతి కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున, శ్రీ సాయి కళాశాల ప్రిన్సిపాల్ ఫణికుమార్, శ్రీనివాస కళాశాల ప్రిన్సిపాల్ ముసలిరెడ్డి, సత్యకృప కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు