విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందించిన వారిని గుర్తించి శాఖ తరపున ప్రశంస ప్రశంసాపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ పరిపాలన అధికారి గిరిజ మనోహర్రావు, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ జయలక్ష్మి, డాక్టర్ గంగాధర్ రెడ్డి,మలేరియా అధికారి ఓబులు, డెమో నాగరాజు, డిప్యూటీ డెమో లక్ష్మీనారాయణ, డిప్యూటీహెచ్ఈఓ గంగాధర్, ఎస్ ఓ మహమ్మద్ రఫీ పీఎంఓ నాగన్న, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


