Homeజాతీయంకేంద్రమంత్రికి రూ.కోటి సబ్సిడీ

కేంద్రమంత్రికి రూ.కోటి సబ్సిడీ

- Advertisement -

ప్రభుత్వ ఖజానా మంత్రుల బంధుమిత్రుల సొత్తుగా మారింది: కాంగ్రెస్
న్యూదిల్లీ:
వడ్డించే వారే భుజించేస్తున్నట్లుంది కేంద్ర మంత్రి తీరు. పదిమందితో పాటు పంక్తిలో తింటే తప్పేంటని అంటున్నారు కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి భగీరథ్ చౌధరీ. సొంత శాఖ నుంచి రూ.99.60 లక్షలు సాగు రాయితీ పొందడాన్ని పథకాల పచ్చి దోపిడీగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. వాణిజ్య పంటల ప్రోత్సాహానికి ఇచ్చే రాయితీ మొత్తాన్ని ఆయనే ఉపాధ్యక్షుడిగా ఉన్న బోర్డు ఆమోదించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై శనివారం మంత్రి భగీరథ్ స్పందిస్తూ…‘ఇందులో దాచేందుకు ఏమీ లేదు. వేల మంది రైతులు పాలీహౌస్‌లకు ప్రభుత్వ సాయం పొందుతున్నట్టే ఒక రైతుగా నాకు కూడా రాయితీ వచ్చింది. స్థానిక రైతులకు కొత్త సాంకేతిక పద్ధతులు, ప్రకృతి సాగుపై నేను శిక్షణ కూడా ఇస్తున్నా’ అని సమర్థించుకున్నారు. మంత్రి వివరణపై కాంగ్రెస్ నేత పవన్‌ఖేడా మాట్లాడుతూ ‘దరఖాస్తుదారు, మంజూరు చేసే అధికారి, లబ్ధిదారు…అన్నీ మీరే. ప్రభుత్వ ఖజానా మంత్రులు, వారి బంధుమిత్రుల ఆస్తిగా మారింది’ అని ధ్వజమెత్తారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు