డిపో మేనేజర్ సత్యనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం : జూలై 10వ తేదీ పౌర్ణమి సందర్భంగా భక్తాదుల కోరిక మేరకు అరుణాచలం, గిరి ప్రదర్శన, కాణిపాకం గోల్డెన్ టెంపుల్ దర్శనార్థం ధర్మవరం ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేయడం జరిగిందని డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బస్సు జూలై 9వ తేదీ ఉదయం 6 గంటలకు బయలుదేరుతుందని, అందుకుగాను రాను పోను చార్జీలు రూ.1,400 ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా భక్తాతలు ఆన్లైన్లో గాని, బస్టాండ్ రిజర్వేషన్ కౌంటర్లో గాని తమ సీట్లను రిజర్వేషన్ చేసుకునే అవకాశం కూడా ఉందని వారు తెలిపారు.ఁభగవంతుని సేవలో భక్తులు! -భక్తుల సేవలో ఏపీఎస్ఆర్టీసీ ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9959225859 కు సంప్రదించాలని తెలిపారు. కావున ఇటువంటి అవకాశాన్ని భక్తాదులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
అరుణాచలం, గిరి ప్రదర్శనకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాటు..
- Advertisement -
RELATED ARTICLES


