విశాలాంధ్ర నందిగామ :-కారుని బైక్ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన నందిగామ మండల పరిధిలోని మునగచర్ల గ్రామ సమీపంలో నేషనల్ హైవే 65 పై శుక్రవారం ఉదయం జరిగింది పోలీసులు అందించిన సమాచారం మేరకు మండల పరిధిలోని మునగచర్ల గ్రామ సమీపంలో నేషనల్ హైవే 65 పై హైదరాబాద్ నుండి వస్తున్న కారు బైక్ ను ఢీకొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న చలమాల శ్రీనివాసరావు(56) మరణించినట్లు గా తెలిపారు కారులో ప్రయాణిస్తున్న ఇరువురు వ్యక్తులకు బెలూన్లు ఓపెన్ కావడంతో ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడ వారు ఊపిరి పీల్చుకున్నారు సంఘటన ప్రాంతంలో పరిశీలించిన పోలీసులు నందిగామ మార్చురీకి మృతదేహాన్ని తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు….
బైకును కారు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి…
- Advertisement -
RELATED ARTICLES


